ఏపీ విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త…

-

ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు ఆర్టీసీ తీపికబురు చెప్పింది. ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయం తో ఏపీ లో విద్యార్థులకు బస్ పాస్ రెన్యూవల్ కష్టాలు తప్పనున్నాయి. ప్రతి నెలా ఆన్ లైన్లోనే స్టూడెంట్ బస్ పాస్ రెన్యూవల్ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టనుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ. విజయవాడ బస్టాండులోని బస్ పాస్ కౌంటర్ వద్ద వేచి ఉన్న విద్యార్ధినులతో ఇవాళ ముచ్చటించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని నాని.

బస్టాండు లో ఎందుకున్నారని విద్యార్ధినులను ఈ సందర్భంగా అడిగారు మంత్రి పేర్ని నాని. బస్ పాస్ రెన్యూవల్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పారు విద్యార్ధినులు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్లో స్టూడెెంట్ బస్ పాస్ రెన్యూవల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు కు మంత్రి పేర్ని నాని ఆదేశాలు జారీ చేశారు. ఒకట్రొండు నెలల్లో ఆన్ లైన్ విధానంలో బస్ పాస్ రెన్యూవల్ విధానం ప్రవేశపెడతామని విద్యార్ధినులకు చెప్పారు మంత్రి పేర్ని నాని. దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై విద్యార్ధినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version