BREAKING : TSPSC నుంచి గ్రూప్‌-3 నోటిఫికేషన్‌

-

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన మేరకు రాష్ట్రంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ నుంచి వరుస ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. తాజాగా గ్రూప్-3 నోటిఫికేషన్ ను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1365 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 24వ తేదీన ప్రారంభం కానుండగా.. దరఖాస్తుకు ఫిబ్రవరి 23ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. మొత్తం 107 విభాగాల్లోని ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భార్తీ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈరోజే మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) శుక్రవారం వైద్య మరియు ఆరోగ్య శాఖలో వివిధ స్థాయిలలో 5, 204 స్టాఫ్ నర్సుల పోస్టుల ప్రత్యక్ష నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. అర్హులైన అభ్య‌ర్థులు జ‌న‌వ‌రి 25 నుంచి ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు. డీఎంఈ, డీహెచ్ ప‌రిధిలో 3,823 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వైద్య విధాన ప‌రిష‌త్‌లో 757 పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. డీఎంఈ, డీహెచ్ – 3,823, వైద్య విధాన ప‌రిష‌త్ – 757, ఎంఎన్‌జే క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ – 81, డిజ‌బుల్డ్, సినీయ‌ర్ సిటిజెన్స్ వేల్ఫేర్ – 8, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియ‌ల్స్ – 127, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్స్ – 197, ట్రైబ‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్స్ – 74, సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 124, తెలంగాణ రెసిడెన్షియ‌ల్స్ ఎడ్యుకేష‌న్ ఇన్‌స్టిట్యూష‌న్ – 13 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయబడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version