వన్ ప్లస్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ లాంచ్..స్పెసిఫికేషన్స్,ధర..

-

దేశంలో ప్రముఖ బ్రాండ్ ఫోన్లలో యాపిల్ తర్వాత స్థానంలో వచ్చేది వన్ ప్లస్..యాపిల్ ఫోన్లతో పోలిస్తే ఈ ఫోన్లకు మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే..ఇప్పటికే కొత్త కొత్త ఫీచర్లతో ఎన్నో రకాల ఫోన్లను ఈ కంపెనీ అందుబాటులో ఉంచింది.ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ ను అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ గురించిన ఇంఫర్మెషన్ ఆన్ లైన్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా లాంచ్ చేస్తున్న డేట్ ను అనౌన్స్ చేశారు.

 

గత నెలలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ, వన్‌ప్లస్ 10ఆర్ 5జీ మొబైళ్లను లాంచ్ చేసిన ఆ ప్రముఖ కంపెనీ భారత మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అయింది. మిడ్ రేంజ్‌లో ఎంతో ఫేమస్ అయిన నార్డ్ సిరీస్‌లో దీన్ని లాంచ్ చేయనుంది. ఈ నెల 19వ తేదీన ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5G ఫోన్ ను లాంచ్ చేయనుంది..ఇటీవలే నేపాల్ లో లాంచ్ చేసిన ఈ ఫోన్ ను మంచి రెస్పాన్స్ రావడంతో త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయనున్నారు.

ఈ ఫోన్ ఫీచర్లు:

6.43 ఇంచుల ఫ్లాట్ Full HD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుందని సమాచారం. 90Hz రిఫ్రెష్ రేట్ ఉండనుంది. ఈ మొబైల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఈ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. ఇక కెమెరా..వెనుక మూడు సెన్సార్లు ఉండే అవకాశం ఉంది. 50 MP Sony IMX766 ప్రధాన కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ షూటర్, 2 MP మోనోక్రోమ్ సెన్సార్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండొచ్చు.
ఈ కొత్త వన్‌ప్లస్ మొబైల్‌లో 4500mAh బ్యాటరీ ఉంటుందని సమాచారం.

మార్కెట్ లో ఈ ఫోన్ల ధర:

8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే ఒకే వేరియంట్‌లో వన్‌ప్లస్ నార్డ్ 2టీ లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర నేపాల్‌లో 64,999 నేపలీస్ రూపీలుగా ఉంది. ఇండియాలో రూ.32వేల నుంచి రూ.35వేల మధ్య రేంజ్‌లో ఈ ఫోన్ ధర ఉంటుంది.ఈ ఫోన్ మార్కెట్ లో విడుదల కాక ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version