ఆర్జీవీ కోసం హైదరాబాద్‌కు ఒంగోలు పోలీసులు

-

ఏపీలో ప్రస్తుతం సోషల్ మీడియా వారియర్స్ మీద నిఘా కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నేతలైన తెలుగుదేశం పార్టీ లీడర్లు, మాజీ మంత్రులు, అధినేత చంద్రబాబు వారి కుటుంబ సభ్యులపైన వివాదాస్పద పోస్టులు పెట్టిన వారిని గుర్తించి పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.

రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య టీం బుధవారం ఆర్జీవీకి సమన్లు జారీచేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ మద్దిపాడు పీఎస్‌లో ఆర్జీవీపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news