రవాణా శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా ఆన్ లైన్ సేవలను ప్రారంభించింది. వాహనదారులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులకు కష్టాలు తప్పనున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్స్.. రెన్యూవల్ చేసుకోవడానికి ఆర్టీఏ కార్యాలయాల చుట్టు తిరగాల్సి వస్తుండేది. దీంతో కష్టాలు, వ్యయప్రయాలు, డబ్బులు వదిలించుకోవడం జరిగేది.
రవాణ శాఖ పరిధిలోని ఆర్టీఏ కార్యాలయాల్లోకి వెళ్లగానే ప్రతి దానికో రేటు ఫిక్స్ చేసి దళారీలు రెడీగా కాపు గాచుకుని కూర్చుంటారు. వాస్తవ ధర రూ.1000 లోపే ఉంటే దళారీలు రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తూ పనులు చేస్తున్నారు. ఆర్టీఏ ఆఫీస్ లో పని అంటే మాములు విషయమా.. డిటైల్ ఫామ్ నింపి.. ఎవరికి ఇవ్వాలోఅర్థం కాదు.. ఎవరితో సంతకం చేయించాలో అర్థం కాని పరిస్థితి. ఒక వేళ తెలిసినా అధికారితో కలిసినా ఆయనుండే బీజీకి సంతకం దొరుకుతుందన్న గ్యారంటీ ఉండదు. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లో దళారీల రాజ్యం నడుస్తుంది.
దళారీలను అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఆర్టీఏ కార్యాలయాల్లో ఆన్ లైన్ సేవలను ప్రారంభించింది. ఈ నిర్ణయం దేశంలోనే తొలిసారి అని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వాహనదారులు ఆన్ లైన్ లో లెర్నింగ్ లైసెన్స్, బ్యాడ్జి, సాధారణ పత్రాలు స్థానంలో స్మార్ట్ కార్డులు వంటి ఐదు రకాల సేవలను రవాణ శాఖలో పొందవచ్చు.
ఈ సేవలతో పాటు భవిష్యత్ లో మరో 12 రకాల సేవలు ఆన్ లైన్ లో పొందలే చర్యలు తీసుకుంటున్నామని, ఈ విధానం అమలుతో వాహనదారులు ఇప్పుడు నేరుగా ఆర్టీఏ కార్యాలయాల ముందు వేచి ఉండాల్సిన అవసరం ఉండదని మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు. ఈ సేవలకు వినిమోగదారులు స్మార్ట్ ఫోన్ లోనే అప్లై చేసుకునే ఆప్షన్ ఉందన్నారు.