ఫార్మా కంపెనీ జెన్‌బర్క్‌ట్ Favivent పేరిట Favipiravir అనే యాంటీ వైరల్ డ్రగ్‌ను కోవిడ్ ట్రీట్‌మెంట్‌కు గాను తయారు చేస్తోంది. ఫావివెట్ మెడిసిన్ ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ.39గా నిర్ణయించారు. ఇవి 10 ట్యాబ్లెట్లు 200 మిల్లీ గ్రాముల డోసులో ఒక స్ట్రిప్‌లో లభిస్తాయి. వీటిని కోవిడ్ సాధారణ, ఒక మోస్తరు, మధ్యస్థ లక్షణాలు ఉన్న కోవిడ్ పేషెంట్లకు చికిత్సకు వాడుతారు.
కాగా ఫావిపిరావిర్ ట్యాబ్లెట్లను ఇప్పటికే పలు కంపెనీలు వివిధ బ్రాండ్ల పేరిట తయారు చేసి విక్రయిస్తున్నాయి. దీన్ని ఇన్‌ఫ్లుయెంజా చికిత్సకు ఉపయోగించేవారు. కోవిడ్ చికిత్సకు ఈ మెడిసిన్ బాగా పనిచేస్తుండడంతో దీన్ని కోవిడ్ చికిత్సకు కూడా వాడడం మొదలు పెట్టారు. ఈక్రమంలో ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఈ మెడిసిన్‌ను కోవిడ్ చికిత్సకు వాడవచ్చని సూచించింది. అలాగే ఈ ఔషధం తయారీకి పలు కంపెనీలకు అనుమతులను కూడా ఇచ్చింది.
ఫావిపిరావిర్ ట్యాబ్లెట్లను గ్లెన్ మార్క్ ఫార్మా ఫాబిఫ్లూ పేరిట విక్రయిస్తోంది. ఒక్కో ట్యాబ్లెట్‌ను ఆ కంపెనీ రూ.75కు విక్రయిస్తోంది. అలాగే బ్రింటన్ ఫార్మాసూటికల్స్ అనే మరో కంపెనీ ఇదే మెడిసిన్ ఒక్కో ట్యాబ్లెట్‌ను రూ.59కు ఫేవిటాన్ పేరిట విక్రయిస్తోంది. ఇక ఫేవివెంట్ ట్యాబ్లెట్లను జెన్‌బర్క్‌ట్ కంపెనీ తెలంగాణలో తయారు చేస్తోంది. ఆ ట్యాబ్లెట్లను ఆ కంపెనీ మార్కెట్‌లో విక్రయిస్తోంది.