తాజాగా తెలంగాణ మంత్రి వర్యులు ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం మీకోసం కార్యక్రమంలో భాగంగా… ప్రతి ఆదివారం కేవలం ఉదయం 10 గంటల సమయంలో పది నిమిషాల సమయం కేటాయించి ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని, దాంతో ఆరోగ్యకరమైన జీవితం అందరూ గడుపుదామని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆయన నేడు ఉదయం 10 గంటల సమయంలో తన ఇంటి ఆవరణలో మొక్కల మధ్య ఉన్న కలుపు తీసివేయడంతో పాటు, నీటి గుంతలు తవ్వి మొక్కలకు నీళ్లు పోసారు కూడా.
ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ… వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో ఎలాంటి సీజనల్ వ్యాధులు సోకకుండా దోమల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు వారి ఇళ్లలో, వారి ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకుంటూ ఎక్కడైనా నీటి నిల్వలు ఉండే వాటిని తొలగించాలని తెలిపారు. ఇలా చేయడం ద్వారా దోమల పెరుగుదలకి కట్టడి జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ గండ్ర ఈశ్వర్, జిల్లా రైతు బంధు సమితి కన్వీనర్ నల్లా వెంకట్ రామ్ రెడ్డి, నిర్మల్ పట్టణ అధ్యక్షులు కొండ రాము అలాగే పార్టీ కి సంబంధించిన కొందరు ప్రముఖులు పాల్గొన్నారు.