యుఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ జనవరిలో వైట్ హౌస్ నుండి బయలుదేరే వరకు ఆమె భర్త డోనాల్డ్ ట్రంప్ కి విడాకులు ఇచ్చే అవకాశం లేదని ట్రంప్ మాజీ సలహాదారుడు ఒకరు వెల్లడించారు. దానికి సంచలన కారణం చెప్పాడు. ట్రంప్ మాజీ సహాయకుడు, సలహాదారుడు… ఒమరోసా మానిగోల్ట్ న్యూమాన్ మాట్లాడుతూ… మెలానియాతో తనకున్న సంబంధం గురించి ‘అన్హింగెడ్’ అనే పుస్తకంలో వివరంగా రాశారు.
నవంబర్ 3 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి తర్వాత విడాకులు తీసుకోవాలని మెలానియా యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెలానియా 2005 లో ట్రంప్‌ను వివాహం చేసుకుని 2006 లో తన అమెరికన్ పౌరసత్వాన్ని సంపాదించింది. మెలానియా ఇప్పుడు గనుక విడాకులు ఇస్తే… ట్రంప్ ఆమెను దేశం నుంచి తనకు ఉన్న అధికారాలతో శాస్వతంగా బహిష్కరించే అవకాశం ఉంది అని అన్నారు. అందుకే ఆమె ఓపికగా వెయిట్ చేస్తున్నారని చెప్పారు.