ఏపీలో “ఆ నేత” ఆధ్వర్యంలో …“ఆపరేషన్ – J”..?

-

ఏపీలో ప్రభుత్వం పనితీరు అసలు బాలేదు భయ్యా, అసలు జగన్ వచ్చినప్పటి నుంచీ కరెంట్ పోతానో ఉంది, నీళ్ళు రావడంలేదు మా రూమ్ లో నీళ్ళ సమస్య వలన ఈరోజు చాలా ఇబ్బందులు పడ్డాం, ఏపీ ఫైబర్ నెట్ కి నీళ్ళు వదిలేశారు జగన్ పార్టీ, రేషన్ కార్డులు 2 లచ్చలు తీసేశారు ఎంత ఘోరమో తెలుసా, ఓరిని అదొక్కటేనా అసలు ఫించను వస్తేనేగా మా తాత కి మూడు నెలల నుంచీ ఫించను రావడంలేదు. ఇప్పటి వరకూ మీరు చదివిన మాటలు ఎక్కడో విన్నట్టుగా ఉన్నాయా..?? ఎవరో మీ పక్క వారితోనో, మీతోనో మాట్లాడినట్టుగా అనిపించాయా..?? అయితే ఇది నిజమే కానీ ఇదంతా ఆపరేషన్ –J లో భాగమే. ఇంతకీ ఆపరేషన్ – J ఏమిటి..??

operation J In AP

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా పూర్తి చేసుకోలేదు. మెల్ల మెల్లగా అడుగులు వేస్తోంది. టీడీపీ పెట్టిన బొక్కల లెక్కలు తెల్చుతూ ఎంతో వ్యూహాత్మకంగా ప్రతీ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ పై టీడీపీ పార్టీ విష ప్రచారానికి తెర తీస్తోంది. టీడీపీలో ఓ నేత ఆధ్వర్యంలో జగన్ పై భారీ స్థాయిలో ప్రజలకి అసంతృప్తి కలిగేలా ప్రచారం నిర్వహిస్తోంది. దీనికి ఆపరేషన్ –J అనే పేరు కూడా ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ –J అంటే “ జగన్” అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం.

మౌత్ పబ్లిసిటీ, ఈ రకమైన ప్రచారం ఎన్నో వ్యవస్థలని నాశనం చేసిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పుడు దీన్నే నమ్ముకున్నదట టీడీపీ పార్టీ. అంతేకాదు టీడీపీ కి వత్తాసుగా జనసేన పార్టీ కూడా జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో తమ అభిమానుల వాట్సప్ గ్రూప్స్ లో విష ప్రచారం చేస్తోంది. వీరి ముఖ్యమైన టార్గెట్ ఏమిటంటే. ఒక్క ఛాన్స్ ఇస్తే మీ లతరాతలు మార్చుతా అన్నాడు , ఓటు వేస్తే నీళ్ళు రాకుండా , గృహ అవసరాలు ఒక్కొక్కటిగా బంద్ అవుతున్నాయి అంటూ దుష్ప్రచారం చేయడమే.

జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ఎదో ఒకరకంగా మసి పూసి మారేడు కాయ చేయడం ఈ ఆపరేషన్ – J లో భాగమనే టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే గ్రామలలో తమ మద్దతుదారులతో ఈ ప్రచారానికి తెర తీస్తున్నారు. పార్టీల బలాబలాలు ఎక్కువగా గ్రామస్థాయిలోనే ఉంటాయి.కాబట్టి జగన్ ప్రభుత్వ పధకాలపై , జగన్ తీసుకుంటున నిర్ణయాలపై అక్కడి నుంచీ యాంటీ ప్రచారం మొదలు పెడితే మెల్లమెల్లగా జగన్ పై వ్యతిరేకత తీసుకురావచ్చు అనే ఆలోచనలో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారట టీడీపీ నేతలు. అయితే ఈ వ్యూహాలు మొత్తం టీడీపీలోని ఓ కీలక నేత ఆధ్వర్యంలో జరుగుతున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది.మరి ఈ విషయంపై వైసీపీ కీలక నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version