మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ కంటిన్యూ అవుతోంది..శాంతి చర్యలకు తాము సిద్ధమని.. పోలీసు బలగాలను వెనక్కి పిలవాలని లేదా కాల్పులు జరపకుండా తటస్థంగా ఉండాలని మావోయిస్టు పార్టీ కోరుతున్నది. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కర్రిగుట్టల్లో ఎనిమిది రోజులుగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది.మావోయిస్టుల కోసం కర్రెగుట్టల్లో బలగాలు జల్లెడ పడుతున్నాయి.పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో బలగాల కూంబింగ్ కొనసాగుతుండగా.. 25 వేల మంది భద్రతా బలగాలను అక్కడ కేంద్రం మోహరించింది.ఈ క్రమంలోనే బీర్ బాటిళ్లలో అమర్చిన బాంబులను బలగాలు నిర్వీర్యం చేశాయి.130కి పైగా ఐఈడీ బాంబులను సైతం గుర్తించి నిర్వీర్యం చేశాయి. మావోయిస్టు సెంట్రల్ కమిటీ నేతలు కర్రెగుట్టల్లో ఉన్నట్లు బలగాలు గుర్తించనట్లు తెలుస్తోంది.