ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ పాక్ స్టాక్ మార్కెట్ల పై పడింది. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలింది. పాక్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కరాచీ భారీగా క్షీణించింది. దాదాపు 6% మేర నష్టపోయాయి పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు.

ఇది ఇలా ఉండగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్‌కి ఇద్దరు మహిళా అధికారులు నాయకత్వం వహించారు. కల్నల్ సోఫియా ఖురేషీ – యునైటెడ్ నేషన్స్ శాంతి రక్షణ బృందానికి ఎంపికైన తొలి భారతీయ మహిళా ఆఫీసర్. యుద్ధ వ్యూహాలు రచించడంలో ఆమె దిట్ట. అలానే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ – భారత వైమానిక దళంలో అనుభవమున్న అధికారి. ఈ ఆపరేషన్‌లో ఆమె గగన తలంలో కీలక పాత్ర పోషించారు.
- ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్
- కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్లు
- భారీగా క్షీణించిన పాక్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కరాచీ
- దాదాపు 6% మేర నష్టపోయిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు