టెర్రరిస్టుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి జరిపిన ‘ఆపరేషన్ సింధూర్’ పాకిస్థాన్‌కు వణుకు పుట్టిస్తోంది. బవహల్పూర్‌లోని జైష్-ఎ-మహమ్మద్, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మెరుపు దాడులు చేసింది. ఈ ఘటనల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.
తాజాగా ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరుదేశాలు ఉద్రిక్తతలు ఇరు దేశాలు తగ్గించుకోవాలని సూచించారు. భారత్ , పాకిస్తాన్ నడుమ పరిస్థితిలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. భారత్, పాక్‌లు దశాబ్దాలుగా గొడవ పడుతున్నాయని.. రెండు శక్తివంతమైన దేశాలు రోడ్లపైకి వచ్చి ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరని హితవు పలికారు.ప్రపంచానికి శాంతి కావాలి.. ఘర్షణలు వద్దని ట్రంప్ పిలుపునిచ్చారు.