మొబైల్స్ తయారీదారు ఒప్పో నూతనంగా ఎఫ్17 ప్రొ పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఎఫ్ సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ ఒప్పో ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన సూపర్ అమోలెడ్ డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. ముందు వైపు 16, 2 మెగాపిక్సల్ కెపాసిటీలు కలిగిన డ్యుయల్ పంచ్ హోల్ కెమెరాలు రెండు ఉన్నాయి. మీడియాటెక్ హీలియో పి95 ప్రాసెసర్, 8జీబీ పవర్ఫుల్ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. 48, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను ఇందులో అందించారు. 4015 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి 30 వాట్ల ఫ్లాష్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది.
ఒప్పో ఎఫ్17 ప్రొ స్పెసిఫికేషన్లు…
* 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే
* 2400 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్లస్ ప్రొటెక్షన్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి95 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్
* 128జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్
* 48, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు
* ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ
* డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి
* 4010 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫ్లాష్ చార్జ్
ఒప్పో ఎఫ్17 ప్రొ స్మార్ట్ ఫోన్ మ్యాజిక్ బ్లూ, మ్యాట్ బ్లాక్, మెటాలిక్ వైట్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. రూ.22,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు సెప్టెంబర్ 7 నుంచి లభ్యం కానుంది.