పార్లమెంట్​లో భారత్​-చైనా వివాదంపై చర్చకు విపక్షాల డిమాండ్​

-

భారత్- చైనా సరిహద్దు సమస్యపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టడం వల్ల లోక్​సభ గురువారం రెండోసారి వాయిదా పడింది. సభ ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు నినాదాలు చేయడం వల్ల స్పీకర్ తొలుత​.. మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ మళ్లీ ప్రారంభమైనా.. ప్రతిపక్ష నాయకులు చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో స్పీకర్​ మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విపక్షాలను ఉద్దేశించి సభలో మాట్లాడారు. శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగుస్తాయని.. కాబట్టి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన కోరారు. గతంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి అంశాలపై చర్చకు ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదని, అప్పుడు తాము అంగీకరించామని తెలిపారు.

రాజ్యసభలో చైనాతో సరిహద్దు సమస్యపై చర్చకు నిరాకరించినందుకు కాంగ్రెస్​ నేతృత్వంలోని ప్రతిపక్షాలన్నీ గురువారం సభను బహిష్కరించాయి. “మేము శీతాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి చైనాతో సరిహద్దు వివాదంపై చర్చకు డిమాండ్ చేస్తున్నాము. కానీ ప్రభుత్వం మొండి వైఖరి కనబరుస్తోంది. అందుకే ప్రతిపక్షాలన్నీ సభను బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి” అని కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ మీడియాకు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version