ప్రతిప‌క్షాలకు త‌గిన బుద్ధి చెప్పాలి : మంత్రి ఎర్రబెల్లి

-

గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక సమావేశం లో మాట్లాడుతూ, ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్రలు ప‌న్నుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌,పేర్కొన్నారు. ఏటేటా నిధులు త‌గ్గిస్తూ, నిబంధ‌న‌లు క‌ఠినంగా విధిస్తూ ఈ ప‌థ‌కాన్ని పూర్తినా నిలిపివేసే కుట్రలు చేస్తున్నదని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి. కేంద్రంలో కేసీఆర్ ను అధికారంలోకి తేవాలి. అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ నినాదం నిజం కావాలి. దేశంలో రైతే రాజు అనే నానుడి నిజం అవుతూ, ప్రజ‌లు సుభిక్షంగా ఉండే విధ‌మైన ప‌రిపాల‌న కావాలని’ అన్నారు ఆయన. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి స‌హ‌క‌రించ‌క‌పోగా, అడ్డుపుల్ల వేస్తున్నదని దుయ్యబట్టారు. ఈ వైఖ‌రి కార‌ణంగా తెలంగాణ అభివృద్ధి కుంటు ప‌డుతున్నదని వెల్లడించారు మంత్రి ఎర్రబెల్లి.

 

సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని సమైక్య పాలనలో నిరాదరణకు గురైన పల్లెలు నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. మాయ మాటలతో తెలంగాణను ఆగం పట్టియ్యాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ను ప్రజలు తరిమికొట్టాలని మండిపడ్డారు ఆయన. ఎర్రబెల్లి ట్రస్టు చైర్ ప‌ర్సన్‌ ఉషా దయాకర్ రావు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అనుబంధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version