కాయ్ రాజా.. కాయ్.. కారు పట్టెయ్.. కాకినాడలో కోడిపందాల విజేత కోసం నిర్వాహకుల బంపర్ ఆఫర్ ప్రకటించారు. కాకినాడలో కోడిపందాల విజేతకు 25 లక్షల రూపాయల విలువైన ‘మహీంద్రా థార్ ‘ గిఫ్ట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 25 లక్షల రూపాయల విలువైన ‘మహీంద్రా థార్ ‘ గిఫ్ట్ వీడియో వైరల్ గా మారింది.
ఇక అటు సంక్రాంతి అనగానే అందరికీ కోడి పందేలు గుర్తొస్తాయి. ప్రతీ జిల్లాలో ఈ పందేలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు మనం కోడి పందేలు, ఎడ్ల పోటీలను చూసాము. దీనికి భిన్నంగా గోదావరి జిల్లాలో పందుల పోటీలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సంక్రాంతి సందర్భంగా పందుల పోటీలు నిర్వహించారు. పందులను రెండు టీమ్స్ చేసి.. ఒకేసారి వదులుతారు.. అలా తలపడగా చివరికీ ఏది నిలబడుతుందో దాన్ని విన్నర్ గా ప్రకటిస్తారు.
కాయ్ రాజా.. కాయ్.. కారు పట్టెయ్..
కాకినాడలో కోడిపందాల విజేత కోసం నిర్వాహకుల బంపర్ ఆఫర్
విజేతకు 25 లక్షల రూపాయల విలువైన ‘మహీంద్రా థార్ ‘ గిఫ్ట్ #KodiPandelu #Kakinada #Andhrapradesh #Sankranthi #Mahindra #Thar pic.twitter.com/dQ4yBHUIlB
— Pulse News (@PulseNewsTelugu) January 14, 2025