బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని నిన్న జూబ్లీహిల్స్ లో అరెస్ట్ చేసి కరీంనగర్ కి తరలించిన విషయం తెలిసిందే. అయితే కౌశిక్ రెడ్డి పై మూడు కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసారు. ఇవాళ కరీంనగర్ జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు ఆయనను విడిచిపెట్టిన వెంటనే స్టేషన్ ఆవరణలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనను అక్రమంగా అరెస్ట్ చేయించారని ఆరోపించారు.
ప్రస్తుతం రాజకీయ వ్యాఖ్యలు చేయను.. కోర్టు నిబంధనలు అడ్డు వస్తాయని తెలిపారు. కరీంనగర్ లో ప్రెస్ మీట్ పెట్టొద్దని కోర్టు ఆదేశాలు అమలులో ఉన్నాయని తెలిపారు. పండుగ పూట రాజకీయాలు మాట్లాడదలచుకోలేదని తెలిపారు. బుధవారం తన అరెస్ట్ పై హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి వివరాలు చెబుతానని తెలిపారు కౌశిక్ రెడ్డి. తనను అరెస్ట్ చేసారని తెలియగానే తనకు మద్దతు తెలిపిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు కౌశిక్ రెడ్డి.