ఆస్కార్ అవార్డ్స్ ఉత్తమ చిత్రంగా నొమద్ లాండ్..

-

సినిమా పురస్కారాల్లో అత్యుత్తమమైనదిగా చెప్పుకునేది ఏదైనా ఉందంటే అది ఆస్కార్ అవార్డే. ఈ సంవత్సరం 93వ ఆస్కార్ అవార్డు ఉత్సవం జరిగింది. అందులో ఉత్తమ చిత్రంగా నొమద్ లాండ్ చిత్రం ఎంపికైంది. మహిళా దర్శకురాలు జావో దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మూడు అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకురాలిగా జావో, ఉత్తమ నటిగా ఫ్రాన్సెస్ డార్మండ్ ఎంపికయ్యారు. దీంతో చిత్రబృందం చాలా సంతోషంగా ఉంది.

ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న ఫ్రాన్సిస్ మాట్లాడుతూ, వీలైతే నొమద్ లాండ్ సినిమాని థియేటర్లలో చూడండని తెలిపింది. జెస్సికా బ్రూడర్ రచించిన నొమద్ లాండ్ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అవార్డు అందుకున్న జావో, మొదటి నల్లజాతి మహిళగా, అలాగే ఆస్కార్ అందుకున్న రెండవ దర్శకురాలిగా గుర్తింపు పొందింది. డైరెక్టర్ గానే కాదు బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్ విభాగంలోనూ నామినేట్ అయిన జావో, అందులో అవార్డు గెలుచుకోలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version