రాజకీయాల వల్లే మా కుటుంబాలు విడిపోయాయి : కల్వకుంట్ల రమ్యారావు

-

రాజకీయాల వల్లే తమ కుటుంబాలు విడిపోయాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కూతురు కల్వకుంట్ల రమ్యరావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించక పూర్వం తమ కుటుంబాలు కలిసే ఉన్నాయని.. రాష్ట్రం సాధించాక జరిగిన రాజకీయ పరిణామాల వల్లే కుటుంబాలు దూరం అయ్యాయని ఆమె మీడియాకు వివరించారు.

 

చిన్నప్పుడు కవిత, కేటీఆర్, నేను బాగానే కలిసి ఉండేవాళ్లమని చెప్పారు. రాజకీయాల వల్లే తెలంగాణ వచ్చిందని కానీ, తమ కుటుంబం విడిపోయిందని అన్నారు. ఇదిలాఉండగా, గత కొంతకాలంగా కేసీఆర్ కుటుంబానికి రమ్యారావు ఫ్యామిలీ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కేసీఆర్ ఫ్యామిలీ నుంచి కవిత, కేటీఆర్ యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండగా.. రమ్యరావు దూరంగా ఉంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news