టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ ప్రొడక్షన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ ఊరట దక్కలేదు. విశాఖ రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఫిల్మ్ సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చని అనుమతించింది జగన్ ప్రభుత్వం.

గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసు ఇచ్చింది ప్రస్తుత ప్రభుత్వం. ప్రభుత్వ షోకాజ్ నోటీసును సుప్రీంకోర్టులో సవాలు చేసింది సురేష్ ప్రొడక్షన్స్. పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది ధర్మాసనం. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని పేర్కొంది సురేష్ ప్రొడక్షన్స్.