వామ్మో.. ఆ వ్యక్తి కడుపులో 200లకు పైగా నాణేలు..ఇంకా మేకులు, బ్యాటరీలు కూడా..!

-

కిడ్నీలోంచి వందలకొద్ది రాళ్లు తీసిన ఘటనలు మనం అప్పుడప్పుడు వింటాం.. కానీ ఇది అంతకుమించి.. ఏకంగా వైద్యులు ఓ రోగి పొట్టలోంచి 233 వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. అసలు అన్ని నాణేలు, బ్యాటరీలతో ఆ రోగి ఇంత కాలం ఎలా బతికాడో కూడా వైద్యులకు అర్థంకాలేదు. అన్ని వస్తువులను ఎలా మింగాడు. ఆఖరికి మేకులు, గాజు ముక్కలు కూడా ఉన్నాయట.

ఆ రోగి పేరు జెడ్ వయసు 35 ఏళ్లు. టర్కీలో బుర్హాన్ డెమిర్ అనే వ్యక్తి తమ తమ్ముడికి పొట్టనొప్పిగా ఉందని చెప్పి ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు వైద్యులు తెలిపారు. అతని పొట్టను అల్ట్రాసౌండ్, ఎక్స్ రే స్కానింగ్‌లు, ఎండోస్కోపి చేయించారు. ఆ స్కానింగ్‌లలో పొట్ట నిండా ఎన్నో వస్తువులు ఉన్నట్టు గుర్తించారు. అన్నీ వస్తువలు పొట్టలో ఉన్నాయని తెలిసి వైద్యులకు దిమ్మతిరిగింది. అసలు ఎలా మింగాడో తెలియక అయోమయానికి గురయ్యారు. రోగి బంధువులను, రోగిని ప్రశ్నించగా అతనికి ఇలా వస్తువులు మింగే అలవాటుందని తెలిపారు. వెంటనే ఆపరేషన్ చేసి ఆ వస్తువులన్నింటినీ బయటికి తీశారు. వాటన్నింటనీ ఒక టేబుల్ పరిచగా మొత్తం 233 వస్తువులు ఉన్నట్లు తేలింది.

చిన్న పిల్లలు తెలియక ఏదైనా మింగేయడం సాధారణం. ఒక్క కాయిన్‌ మింగితేనే ఆగం ఆగం అవుతాం..నానా హడావిడి చేసి ఎలాగోలా కాయిన్‌ కక్కిస్తాం. కానీ 35 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి ఇన్ని వస్తువులు మింగడం సాధారణ విషయం కాదని చెబుతున్నారు వైద్యులు. అతనికి ఏదైనా మానసిక సమస్య ఉండొచ్చని అంటున్నారు. ఇప్పుడు ఆపరేషన్ చేసి అన్నీ తొలగించినా కూడా ఆ రోగి తిరిగి అలాంటి వస్తువుల వైపు ఆకర్షితుడై మళ్లీ మింగే ప్రమాదం ఉందట. కాబట్టి అతడిని కచ్చితంగా మానసిక వైద్యుడికి చూపించాలని చెప్తున్నారు.

రోగి బంధువలు కూడా ఇన్ని వస్తువులు లోపల ఉంటాయని ఊహించలేదట. ఏదో కడుపునొప్పి అంటే ఆసుపత్రికి తీసుకొచ్చాం అంటున్నారు.! అయినా ఇదేం అలవాటో..! ఇప్పటికైనా ఆ రోగి మళ్లీ ఇలా కాయిన్స్‌, మేకులు మింగడం మానేస్తాడాని వైద్యులు గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version