గిరిజనులకు శుభవార్త.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

-

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరుజనులకు వాళ్ల మాతృభాషలో విద్యాబోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర వెల్లడించారు. గిరిజనుల భాషలోనే విద్యాబోధనకు అవసరమైన విధంగా పాఠ్య పుస్తకాలను ప్రచురించామని రాజన్నదొర తెలిపారు. గిరిజనులకు వారి భాషలోనే విద్యా బోధన చేస్తే వారిలో చదువు పట్ల ఆసక్తిని పెంచవచ్చన్నారు. తెలుగు భాషని కూడా పరాయి భాషగా చూస్తారని రాజన్న దొర అన్నారు. గిరిజనుల భాషలో వంగపండు కొన్ని పాటలు రాసి చైతన్యం కలిగించేవారు రాజన్న దొర తెలిపారు.

గిరిజనుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రాజన్న దొర పేర్కొన్నారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబించేలా పాఠ్య పుస్తకాలను ప్రచురించామని, సవర, కొండ, కువి, కోయ, ఆదివాసీ, సుగాలి వంటి గిరిజన భాషల్లో పాఠ్య పుస్తకాలను ముద్రించామన్నారు. గిరిజన కార్పోరేషన్ త్పత్తుల్లో కొన్ని చోట్ల కల్తీ జరుగుతోందని రాజన్న దొర వెల్లడించారు. నాకు ఫిర్యాదులు వచ్చాయి.. కల్తీ ఉత్పత్తులు నాకు చేరాయన్నారు. జీసీసీలో కల్తీ ఉత్పత్తులను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాజన్న దొర తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version