హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పంచాయితీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వద్దకు చేరింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై విచారణ జరిపి తనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఎమ్మెల్యే సంజయ్ విజ్ఞప్తి చేశారు.
కౌశిక్ రెడ్డి తనను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు కొట్టడానికి వచ్చినట్లు పేర్కొన్నారు. సమావేశంలో తనను తోసేశారని ఎమ్మెల్యే సంజయ్ సోమవారం స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలాఉండగా, కలెక్టరేట్‌లో జరిగిన ఘటనతో కౌశిక్ రెడ్డిపై ఇప్పటికే కరీంనగర్‌లో మూడు కేసులు నమోదయ్యాయి.