ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా : పాడి కౌశిక్‌ రెడ్డి

-

‘ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక యాక్షన్‌ చేసే నాయకుడు వస్తడు. మీ మధ్య చేరి నటిస్టడు. నమ్మితే మోసపోవడం ఖాయం’ అని మండలి విప్‌, బీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పాడి కౌశిక్‌రెడ్డి ప్రజలకు సూచించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, జమ్మికుంటలో వరద కోసం శాశ్వత పరిష్కారం చూపలేని నాయకుడు మనకు అవసరమా..? అన్ని ప్రశ్నించారు. ‘మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి.. ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని’ స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా కరీంనగర్‌ జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్‌ గార్డెన్‌లో చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. స్వరాష్ట్రంలో చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని, పద్మశాలీ కులస్థుల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామని చెప్పారు.

ఇది ఇలా ఉంటె, హుజూరాబాద్ బై ఎలక్షన్ టైంలో వీణవంక మండలంలోని పలుగ్రామాలకు మంజూరైన కమ్యూనిటీ హాళ్లు, ఇతర పనులు క్యాన్సిల్ అయ్యాయి. మండలంలోని 12 గ్రామాల్లో రూ.2.69 కోట్ల విలువైన 32 పనులను క్యాన్సిల్ చేస్తూ జులై 14న అప్పటి కలెక్టర్ కర్ణన్ రిలీజ్ చేసిన ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగు చూశాయి. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రపోజల్ ​మేరకు పనులను రద్దు చేసిన కలెక్టర్.. మొత్తం ఫండ్స్​ను వీణవంక మండల కేంద్రానికి మళ్లించారు. అక్కడ సీసీ రోడ్లు, డ్రెయిన్స్, కమ్యూనిటీ హాళ్లకు సంబంధించి 86 చోట్ల కొత్త పనులకు ప్రపోజల్స్​ పంపగా ఆమోదం తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version