గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబు

-

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో గవర్నరు కోటాలో ఇద్దరు శాసన మండలి సభ్యుల నియామకానికి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ అమోదం తెలిపారు. ఏపీ శాసన మండలిలో గవర్నరు కోటాలో ఖాళీగా ఉన్న ఇద్దరు శాసన మండలి సభ్యుల స్థానాలను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నిక అధికారి మరియు ప్రభుత్వ ఎక్స్అఫిషియో ప్రిన్సిఫల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులను జారీ చేశారు.

ఏపీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబులను నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన రవిబాబు ఎస్టీకాగా, కాకినాడ సిటీకి చెందిన పద్మశ్రీ వాడ బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు. వీరి పేర్లను ప్రతిపాదిస్తూ ప్రభుత్వం గవర్నర్కు లిస్టు పంపగా, ఇప్పుడు ఆమోదం లభించింది. ఈనెల 20తో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ కానున్నాయి. గతంలో గవర్నరు కోటాలో శాసన మండలి సభ్యులుగా నియమించబడిన చాదిపిరాళ్ల శివనాథ రెడ్డి, ఎన్.ఎం.డి.ఫరూక్ పదవీ కాలం జులై 20వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆ ఖాళీ స్థానాల్లో నూతనంగా కుంబారవి, పద్మశ్రీలను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version