పహెల్గాం ఉగ్రదాడి.. మధుసూదన్ ఫ్యామిలీ ఇంటికి హీరో మంచు విష్ణు

-

జమ్ముకాశ్మీర్ లోని పహెల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో అమాయకులైన 26 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరు విదేశీ టూరిస్టులు సైతం ఉన్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన మధుసూదన్ అనే వ్యక్తి సైతం ప్రాణాలను కోల్పోయారు.

అయితే, పహెల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ కుటుంబ సభ్యులను శుక్రవారం మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు పరామర్శించారు.మధుసూదన్ భార్యాపిల్లలను ఓదార్చి ధైర్యం చెప్పారు.పహెల్గాం ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ మృతి చెందగా ఆయన కుటుంబానికి ఏపీ సర్కార్ అండగా నిలిచింది. కాగా, ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ సన్నాహాలు చేస్తున్నది.

Read more RELATED
Recommended to you

Latest news