తెలంగాణ సీఎస్ శాంతికుమారి పదవీ కాలం గతనెల 30తో ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె మానవ హక్కుల కమిషన్ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆమె స్థానంలో కొత్తగా సీఎస్‌గా రామకృష్ణరావును తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలోనే ఆయన బాధ్యతలు సైతం స్వీకరించారు.
తాజాగా ఆయన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యాక .. రామకృష్ణారావును గుత్తా సుఖేందర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి సత్కరించారు. వీరిద్దరి మధ్య ప్రభుత్వ పరమైన కీలకమైన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.