సౌత్ ఆఫ్రికా మరియు పాకిస్తాన్ ల మధ్య ఈ రోజు జరుగుతున్న మొదటి వన్ డే లో మొదట టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ వల్వర్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఓపెనర్లు ఇద్దరూ కూడా స్వల్ప స్కోర్ కె అవుట్ అవడంతో , మళ్ళీ పాత కథే అనుకున్నారు. కానీ సెకండ్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన సన్ లస్ (107) ఆ తర్వాత క్రేజులోకి వచ్చిన కప్ (100) ఇద్దరూ కలిసి పాకిస్తాన్ బౌలర్లను ఆటాడుకున్నారు. వీరిద్దరూ నాలుగవ వికెట్ కు ఏకంగా 183 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పాకిస్తాన్ నుండి ఆటను లాగేసుకున్నారు. వీరిద్దరూ సెంచరీ చేసి సౌత్ ఆఫ్రికాకు పోరాడగలిగే స్కోర్ ను అందించారు. నిర్ణీత ఓవర్ లలో నాలుగు వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ స్కోర్ ను పాకిస్తాన్ ఛేదించడం దాదాపుగా ఆసాద్యమే.
మరి టీ 20 సిరీస్ లో చేసినట్లు ఏమైనా అద్భుతం చేస్తారా చూడాలి. ఇక పాకిస్తాన్ బౌలర్లలో నస్రా సందు రెండు వికెట్లు సాధించింది.