జీ20 సదస్సు కోసం భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లను చేసింది. దేశ రాజధాని దిల్లీలో కొత్తగా ప్రారంభించిన ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం జీ 20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. భారతదేశం సాంకేతిక నైపుణ్యం, ఆవిష్కరణలను ప్రదర్శించడానికి జీ సదస్సు సందర్భంగా భారత్ మండపంలో వివిధ ప్రదర్శనలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఈ ప్రదర్శనలు సందర్శకులకు అనేక విశిష్టమైన అనుభవాలను అందించనున్నాయి. జీ20 సదస్సుకు వేదికైన భారత్ మండపం ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ ప్రాజెక్ట్ .. ‘కల్చర్ కారిడార్ – G20 డిజిటల్ మ్యూజియం’ని ప్రదర్శిస్తుంది.
ఆస్క్ గీత ఇదొక ఇండియన్ AI సంచలనం..ఇప్పుడు జి20 సమ్మిట్లో ప్రత్యేక ఆకర్షణ.. సమావేశం జరిగే ప్రగతి మైదాన్ భారత్ మండపంలో హాల్స్లో డిజిటల్ ఇండియా ఎక్స్పీరియెన్స్ జోన్లో ఇన్స్టాల్ చేశారు. ఆస్క్ గీత ఎగ్జిబిట్.. పవిత్ర గ్రంథం భగవద్గీతలో పేర్కొన్న విధంగా తగిన పరిష్కారాలను అందించే అద్భుత వినూత్న వేదిక. శ్రీమద్ భగవద్గీత ఆధారంగా ప్రశ్నలకు సమాధానిమిచ్చే ఏఐ మోడల్. ప్రగతి మైదాన్ లోని భారత్ మండపంలోని 4, 16 హాల్స్లో డిజిటల్ ఇండియా ఎక్స్పీరియెన్స్ జోన్ లో దీనినిఇన్ స్టాల్ చేశారు. గీత ప్రతినిధులతో సహా సందర్శకులందరికీ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఇంగ్లీషు, హిందీ భాషలతో ఏఐ మోడల్ ఆధారిత ఆస్క్ గీత ద్వారా జీవితంలో ఎదురైన సమస్యలకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పినట్లుగా తగిన పరిష్కారాలను అందిస్తుంది.