భారత్‌ను తీవ్రంగా నష్టపరిచినట్టు సోషల్ మీడియాలో పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఆర్మీ కమాండర్ వ్యోమికా సింగ్ స్పందించారు.శనివారం ఉదయం విదేశాంగశాఖ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఉదంపూర్‌లోని S-400 సిస్టమ్, సిర్సాలో ఎయిర్‌ఫీల్డ్స్, నగ్రోటాలో బ్రహ్మోస్ స్పేస్‌లతో పాటు.. ఎన్నో భారత మిలటరీ స్థావరాలను ధ్వంసం చేసినట్టు.. నెట్టింట్లో పాక్ ఫేక్ ప్రచారానికి దిగిందని వివరించారు.
కానీ, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, పాక్ ప్రచారాలను భారత్ పూర్తిగా రిజెక్ట్ చేస్తున్నామని తెలిపారు. మరోవైపు, LoC వెంబడి పాక్ డ్రోన్స్, షెల్స్ ప్రయోగం, భారీ ఆయుధాలతో దాడులకు పాల్పడిందని చెప్పారు. ఈ దాడుల్ని భారత్ తిప్పికొట్టిందని.. పాకిస్థాన్ ఆర్మీకి కోలుకోలేని నష్టాన్ని మిగిల్చిందని కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు.