పాకిస్తాన్ సైన్యం కావాలనే భారత వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందని ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి పేర్కొన్నారు. నిన్న రాత్రి పాక్ చేసిన దాడుల గురించి వివరించేందుకు భారత విదేశాంగశాఖ శనివారం ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించింది.ఈ సందర్భంగా ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా భారత వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాక తాము వేగంగా, మరియు వ్యూహాత్మకంగా ప్రతీకారం తీసుకున్నామని తెలిపారు.
భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌కు చెందిన టెక్నికల్ ఇన్‌స్టాలేషన్‌లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లు, ఆయుధ గోదాములను లక్ష్యంగా దాడులు చేశామన్నారు. రఫికీ, మురీద్, చక్లాలా, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చూనియన్‌లోని పాక్ సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించామన్నారు. ఈ ప్రతీకార చర్యల సమయంలో కొలటరల్ డ్యామేజ్ తక్కువగా ఉంచేందుకు భారత దళాలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాయని వెల్లడించాయి.