భారత్ ను మరోసారి పొగిడిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

-

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి ఇండియా పై ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్ విపక్షాలు అవిశ్వాస తీర్మాణం పెట్టిన తర్వాత నుంచి ఇమ్రాన్ ఖాన్ భారత్ పై తెగ పొగడ్తలు కురిపిస్తున్నాడు. పాకిస్తాన్ విదేశాంగ విధానాన్ని, సైన్యం పనితీరును ఇండియాతో పోలుస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఆర్మీ రాజకీయాల్లో జోక్యం చేసుకోదని.. భారత్ తన ప్రజల ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుందని, భారత్ ను ప్రపంచంలోని ఏ సూపర్ పవర్ భయపెట్టలేదని గతంలో వ్యాఖ్యానించారు.

తాజాగా మరోసారి భారత్ పై ప్రశంసలు కురిపించాడు ఇమ్రాన్ ఖాన్. భారత్ అనుసరిస్తున్న విదేశీ విధానాన్ని ప్రశంసించారు. ఓ వైపు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటూనే… మరో వైపు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుందని..వారి ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుందని ఇమ్రాన్ అన్నారు. కానీ పాకిస్తాన్ విదేశీ విధానం ప్రజల ప్రయోజనాలకు దూరంగా ఉందని అన్నారు. ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలపై అక్కడి ఇతర పార్టీలు ఫైర్ అవుతున్నాయి. ఇటీవల అవిశ్వాస తీర్మాణం ఎదుర్కొని ఇమ్రాన్ ఖాన్ తన పదవిని కోల్పోయారు. కొత్తగా షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version