Pakistan: ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్… చేయిచ్చిన మరో మిత్రపక్షం. పదవి పోవడం దాదాపు ఖాయమే

-

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. వరసగా మిత్ర పక్షాలు చేయిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ను గద్దె దించేందుకు ప్రతిపక్షాలతో చేతులు కలుపుతున్నాయి. అద్భుతం తప్పితే కానీ… ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోవడం దాదాపుగా ఖాయం అయింది. ఇన్నాళ్లు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐకి మిత్రపక్షంగా ఉన్న ముత్తాహిదా క్వామీ మూమెంట్ – పాకిస్తాన్ (MQM-P) కూడా దూరం అయింది. అవిశ్వాస తీర్మాణం ముందు ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ఒంటరి అవుతున్నారు.

ఇమ్రాన్ ఖాన్ | imran khan

పాకిస్తాన్ ప్రభుత్వానికి పార్లమెంటులో 164 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. నిజానికి పాకిస్తానీ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులు ఉంటే ప్రభుత్వ ఏర్పాటుకు 172 మంది మద్దతు అవసరం. కానీ ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ కు కేవలం 164 మంది మద్దతు మాత్రమే ఉంది. ఇప్పటికే అవిశ్వాస తీర్మాణానికి పాక్ పార్లమెంట్ అంగీకరించింది. దీనిపై మార్చి 31న చర్చించనున్నారు. ఎప్రిల్ 3న ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్ ఉండే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version