అప్పుల ఊబిలో పాకిస్థాన్..!

-

శత్రుదేశమైన పాకిస్థాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ద్రవ్యోల్భణం పెరిగిపోవడం వల్ల మనదేశంలో రూపాయికి దొరకాల్సిన వస్తువులు పాకిస్థాన్‌లో పది రూపాయలకు దొరకుతుంది. దీంతో ఆ దేశం ప్రస్తుతం అప్పుల ఊబిలో పడి సతమతమవుతోంది. పాకిస్థాన్ పరిస్థితి ఎంత దిగజారిందంటే గతంలో యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) దేశాలు తమలు చెల్లించాల్సిన బిలియన్ డాలర్లను తిరిగి ఇచ్చేయాలని పాకిస్థాన్‌కు డిమాండ్ చేశాయి. అప్పుడు పాకిస్థాన్‌కు చైనా సాయం చేసినా.. తిరిగి అదే సంక్షోభం తలెత్తుతోంది.

ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక దేశం నుంచి అప్పులు తీసుకుని మరో దేశానికి అప్పులు తీర్చుతూ వస్తున్నారు. అలా వేరే దేశాలు అప్పులు తీర్చమని చెప్పిన ప్రతిసారి ఇలా బ్యాలెన్సింగ్ చేస్తూ దేశ పరువును కాపాడుకుంటూ వస్తున్నారు. కాగా, పాకిస్థాన్ దేశ అప్పు 2019 డిసెంబర్ నాటికి 40.94 ట్రిలియన్ రూపాయలు ఉన్నాయి. 2020 చివరి నాటికి ఈ సంఖ్య 45 ట్రిలియన్లకు చేరింది. పాకిస్థాన్ అప్పుల వివరాలను అక్కడి సెంట్రల్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఈ వివరాలు వాస్తవమేనని పాకిస్థాన్ పార్లమెంట్‌లో ఆ దేశ ఆర్థికశాఖ మంత్రి స్పష్టం చేశారు. దేశంలో నివసిస్తున్న 21.66 కోట్ల మందిపై సగటున ఒక్కొక్కరికి రూ. 1.75 లక్షల అప్పు ఉందన్నారు.

అయితే పాకిస్థాన్ అప్పులు ట్రిలియన్లలో ఉండటంపై దేశ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆర్థిక వేత్తలు ఈ అప్పులు ఇప్పటివా.. లేదా కొత్తగా చేసినవా తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, పాకిస్థాన్‌కు చెందిన వార్తా పత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు 46 శాతం వరకు పెరిగాయని తేల్చిచెప్పారు. అయితే గతంలో కూడా పరిస్థితి దారుణంగా ఉండేదని, కానీ ఇమ్రాన్ ఖాన్ పరిపాలనలో దేశం ఆర్థికంగా మరింత దిగజారిందని తెలిపారు. కరోనా ఆర్థిక సంక్షోభం కారణంగా అప్పులు మరింత రెట్టింపు అయిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version