పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రజలు మరణించడంతో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ దాడికి బాధ్యులుగా పేర్కొనబడిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో, భారత్ పాకిస్తాన్‌పై ప్రతీకారం కోసం చర్యలు తీసుకోవాలని చూస్తోంది, ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు వివిధ నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. పాక్ ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్ మార్వాత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మీడియా వారు ఆయనను అడిగిన ప్రశ్న “భారతదేశంతో యుద్ధం జరిగితే, మీరు సరిహద్దుకు వెళ్ళిపోతారా?” అనే ప్రశ్నకు, మార్వాత్ వివాదాస్పదంగా సమాధానమిస్తూ, ‘‘భారతదేశంతో యుద్ధం ప్రారంభమైతే, నేను ఇంగ్లాండ్‌కు వెళ్ళిపోతా’’ అని అన్నారు. పాక్ ఎంపీ మార్వాత్, భారత్ ప్రధాని నరేంద్రమోడీ గురించి మాట్లాడుతూ, “నువ్వే చెప్పితే వినడానికి మోడీ నా అత్త కొడుకా?” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మార్వాత్ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ, పీటీఐపై కూడా విమర్శలు చేసినాడు. ఇందుకు ఫలితంగా, ఇమ్రాన్ ఖాన్ అతడిని పార్టీ నుండి తొలగించారు.