లక్కంటే అతనిదే.. పాకిస్థాన్​ పోలీసు ఖాతాలోకి రూ.10 కోట్లు

-

లక్కంటే పాకిస్థాన్​లోని ఓ పోలీసు అధికారిదే. ఎందుకంటారా.. ఉన్న చోటునుంచి కదలకుండా.. కాస్త కష్టం కూడా చేయకుండా ఏకంగా రూ.10 కోట్లు అతడి అకౌంట్​లోకి చేరాయి. ఎలాగంటారా.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి మరి.

పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ పోలీసు అధికారి బ్యాంకు ఖాతాలోకి రూ.10 కోట్లు వచ్చి పడ్డాయి. అయితే అవి ఎక్కడి నుంచి వచ్చాయో మాత్రం తెలియదు. ‘నా ఖాతాలోకి ఇంత పెద్ద మొత్తంలో నగదు జమ కావడంతో షాక్‌కు గురయ్యాను’ అని సదరు అధికారి ఆమీర్‌ గోపంగ్‌ అన్నారు. బ్యాంకు సిబ్బంది వచ్చి ఈ విషయాన్ని తనకు చెప్పినప్పుడే ఇది తెలిసిందని చెప్పారు. బ్యాంకు అధికారులు తన ఖాతాను బ్లాక్ చేయడంతో పాటు ఏటీఎం కార్డును కూడా బ్లాక్‌ చేశారని చెప్పారు.

మరోవైపు.. ఇదే తరహాలో ఇద్దరు పోలీసుల ఖాతాల్లోకి రూ. 5 కోట్లు వచ్చి పడ్డాయని అధికారులు చెబుతున్నారు. పోలీసుల ఖాతాలోకి ఈ మొత్తం ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని బ్యాంకు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version