అంతర్జాతీయంగా ఎంత ఒత్తిడి వచ్చినా పాకిస్తాన్ మాత్రం తన బుద్ధిని మార్చుకోవడం లేదు. పాకిస్తాన్‌లో మరణశిక్షను అనుభవిస్తున్న భారత్‌కు చెందిన రిటైర్ట్ నేవీ అధికారి కుల్‌భూషణ్ తరుపున వాదించేందుకు భారత న్యాయవాదిని ఒప్పుకోబోమని, ఇందుకు పాకిస్తాన్ చట్టాలు అంగీకరించవని చెబుతోంది. ఈ విషయాన్ని భారత్‌కు పదేపదే చెప్పామని కూడా అంటోంది. కాగా, సెప్టెంబర్ 3న కేసును ఇస్లామాబాద్ హైకోర్టు విచారింనుంది. ఈ నేపథ్యంలో కుల్‌భూషణ్ కేసు తీవ్ర ఉత్కంఠగా మారుతోంది.
ఇదిలా ఉంగా.. 50ఏళ్ల కుల్‌భూషణ్ ఇండియన్ నేవీ రిటైర్డ్ ఆఫీసర్. గూఢచారి ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్‌లో 2017 ఏప్రిల్ నుంచి మరణశిక్షను అనుభవిస్తున్నారు. అయితే.. ఆయనను కాపాడేందుకు భారత్ అంతర్జాతీయ కోర్టను ఆశ్రయించగా.. పాకిస్తాన్ పునరాలోచించాలని తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే.. కుల్‌భూషణ్ తరుపున వాదించేందుకు తమ లాయర్‌కు అవకాశం ఇవ్వాలని భారత్ కోరుతోంది. కానీ.. ఇందుకు తమ చట్టాలు ఒప్పుకోవని పాకిస్తాన్ అంటోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.