కరోనా బారిన పడ్డ కేంద్ర మంత్రి..!

-

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా.. ఈ మహమ్మారి బారిన కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రి క్రిషన్‌ పాల్‌ గుర్జర్‌ పడ్డారు.

ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నానని.. అలాగే గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ఇకపోతే ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 33,10,234 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 25,23,771 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం 7,25,991 మంది చికిత్స తీసుకుంటున్నారు. అలాగే ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 60,472 మరణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version