భార‌త్‌లో క‌రోనా రికార్డు.. ఒక్క‌రోజులోనే 76,826 కేసులు

-

భార‌త్‌లో క‌రోనా వైర‌స్ త‌న రికార్డుల‌ను తానే బ‌ద్ధ‌లు కొడుతోంది. గ‌తంలో ఎన్న‌డూ లేనంతా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌త 24 గంట‌ల్లో ఏకంగా 76,826మంది వైర‌స్ బారిన‌ప‌డ‌గా 1,065 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదు అయిన కేసుల సంఖ్య 3,384,575కు చేరుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు మ‌ర‌ణాల సంఖ్య 61,694కు చేరుకుంది. ఇక దేశంలో అత్య‌ధికంగా కేసులు న‌మోదు అవుతున్న రాష్ట్రాలు ఇలా ఉన్నాయి. మ‌హారాష్ట్ర‌(733,568), త‌మిళ‌నాడు (403,242), ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (3,82,469), క‌ర్నాట‌క‌ (309,000), ఉత్త‌ర ప్ర‌దేశ్‌(2,08,419).

అలాగే.. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 167,604 కేసులు న‌మోదు అయ్యాయి. క‌రోనా దూకుడును చూస్తుంటే.. మ‌రో మూడు నాలుగు రోజుల్లోనే బ్రెజిల్ (3,764,493)ను భార‌త్ దాటేసి రెండో స్థానంలోకి చేరడం ఖాయంగానే క‌నిపిస్తోంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా కేసుల్లో అమెరికా 6,046,060 కేసుల‌తో మొద‌టి స్థానంలో ఉంది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా 24,605,227మంది వైర‌స్ బారిన ప‌డ్డారు. 834,771మంది క‌రోనాతో మ‌ర‌ణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version