మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్

-

అంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా పాకిస్థాన్‌ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. సరిహద్దులో తరచూ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత పౌరులే లక్ష్యంగా నిత్యం ఎక్కడో ఒకచోట కాల్పులు జరుపుతూనే ఉంది.

తాజాగా జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని షాపూర్, కిర్ణి, డేగ్వార్ సెక్టార్లలో నియంత్రణ రేఖ వెంట ఈరోజు ఉదయం 9:15 గంటల ప్రాంతంలో పాక్‌ సైనికులు మోర్టార్లతో షెల్లింగ్స్‌తో, ఆయుధాలతో కాల్పుల జరిపారు. అయితే దీనికి భారత సైన్యం ధీటుగా స్పందించింది. తరచూ ఇలా పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడి సరిహద్దుల్లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఇక చివరిగా ఆగస్టు 22న, జమ్ముకశ్మీర్‌లోని కతువా జిల్లా హిరానగర్ తహసీల్‌ పరిధిలోని చక్ చంగా గ్రామం మీద పాకిస్థాన్‌ దాడులకు తెగబడింది. కానీ భారత సైన్యం ధీటుగా స్పందించడంతో తోక ముడిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version