వర్మ ‘దిశ’ ఫస్ట్ లుక్.. ఆరోజునే రిలీజ్ !

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిశ ఘటన మీద సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈయన హైదరాబాద్ లో సుమారు ఏడాది క్రితం జరిగిన దిశ ఘటనపై సినిమా తెరకెక్కించబోతున్నట్లు ఫిబ్రవరిలోనే ప్రకటించారు. అప్పట్లోనే ఆయన ఈ నేపథ్యంలో రేపిస్ట్‌లలో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకని కలిశారు. ఆమెను తన ఆఫీస్‌కు పిలిపించుకుని మరీ కీలక విషయాలు అడిగి తెలుసుకున్నారు.

ఇక ఈరోజు పదకొండు గంటలకి ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తానని ప్రకటించి అలానే రిలీజ్ చేశారు. ఈ లుక్ లో కేవలం స్కూటీని, అలానే లారీని చూపించారు. అంతే కాక ఒక గన్ ని కూడా చూపించారు. ఈ సినిమా టీజర్ సెప్టెంబర్ 26న రిలీజ్ చేస్తానని పేర్కొన్న అయన సినిమా మాత్రం దిశ ఘటన జరిగిన నవంబర్ 26న రిలీజ్ చేస్తానని పేర్కొన్నారు. అనురాగ్ కంచర్ల అనే ఆయన ప్రొడ్యూస్ చేయనున్న ఈ సినిమాని నట్టి కరుణ సమర్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version