రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో పాకిస్తానీలు ఉన్నారని టాపిక్ కలకలం రేపింది.పాకిస్తానీలు ఇక్కడకు వచ్చి వ్యాపారాలు చేస్తున్నారని అంటూ వీధి వ్యాపారులను బీజేపీ నాయకులు ప్రశ్నించారు.ఈ క్రమంలోనే మంగళవారం బీజేపీ నేత అందెల శ్రీరాములు ఆధ్వర్యంలో బాలాపూర్ పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ ధర్నా చేపట్టింది.
పాకిస్తానీలు మరియు రోహిగ్యాంలు అక్రమంగా ఉన్నారంటూ బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మీరంతా ఎక్కడి నుండి వచ్చారంటూ బీజేపీ నాయకులు పలువురిని ప్రశ్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ క్రమంలోనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.