రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిస్‌వరల్డ్-2025 పోటీల్లో పాల్గొనేందుకు పలు దేశాల నుంచి అందెగత్తెలు విచ్చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల బ్యూటీలు భాగ్యనగరానికి చేరుకున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ స్టార్, నటుడు సోనూసూద్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. మిస్ వరల్డ్ పోటీల కోసం ఆయన నగరానికి విచ్చేశారు.
మంగళవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో సోను సూద్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు మిస్ వరల్డ్ పోటీల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సుందరీమణులు మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గెర్హార్ట్డ్ , మిస్ ఫ్రాన్స్ అగాథే లౌ కౌట్‌కు అధికారులు ఘనస్వాగతం పలికారు. కాగా, ఈ నెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరగనున్న విషయం తెలిసిందే.