పాక్ క్రికెట్ కు ఎదురుదెబ్బ తాకింది. ఎన్నాళ్ల నుంచో తమ సొంతగడ్డపై క్రికెట్ ఆడాలనుకుంటున్న వారికి కల కరోనా కారణంగా అర్థాతంరంగా ముగిసింది. వెస్టీండీస్- పాకిస్థాన్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ ను వచ్చే ఏడాది జూన్ కు వాయిదా వేశారు. రెండు బోర్డులు ఏకాభిప్రాయంతో వాయిదా నిర్ణయానికి వచ్చాయి. వెస్టీండీస్ టీంలో ప్లేయర్లు వరసగా కరోనా బారిన పడుతుండటంతో పాకిస్ఠాన్- వెస్టీండీస్ మధ్య జరుగుతున్న సిరీస్ వాయిదా పడింది. వెస్టీండీస్ ప్లేయర్లలో సిరీస్ ప్రారంభానికి ముందే ముగ్గురు ప్లేయర్లు కరోనా బారిన పడ్డారు అయినా.. రెండు టీ20 మ్యాచులు జరిగాయి. అయితే తాజాగా మరో టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. మ్యాచులు మొదలవ్వడానికి ముందే వెస్టీండీస్ క్రికెట్ టీంలో కాట్రేల్, మేయర్స్, ఛేజ్ లకు కరోనా సోకింది. తాజాగా మరో ముగ్గురు ప్లేయర్లకు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ప్లేయర్లు హోప్, హుసేన్, గ్రీవ్స్ లకు కరోనా సోకింది. వీరిలో పాటు అసిస్టెంట్ కోచ్, టీం ఫిజీషియన్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తంగా వెస్టీండీస్ క్రికెట్ లో 8 మంది కరోనా బారిన పడ్డారు.
గతంలో పాకిస్థాన్ లో పర్యటిస్తున్న శ్రీలంక జట్టుపై ఉగ్రవాదుల దాడికి తెగబడ్డారు. అప్పటి నుంచి ఏవిదేశీ జట్టు కూడా పాకిస్థాన్ లో పర్యటించేందుకు ముందుకు రాలేదు. తాజాగా పాకిస్థాన్ లో పర్యటించేందుకు వెస్టీండీస్ జట్టు ముందుకు వస్తే కరోనా కారణంగా సిరీస్ వాయిదా పడింది. దీంతో పాక్ క్రికెట్ కు షాక్ తప్పలేదు.