సోషల్ మీడియా దిగ్గజం మెటా కు రష్యా షాక్ ఇచ్చింది. రష్యా దేశ నియమ నిబంధనలను పాటించడం లేదని మాస్కో కోర్టు ఆగ్రహానికి గురి అయింది. తమ దేశ చట్టాలకు విరుద్ధం గా ఉన్న కంటెంట్ ను తొలగించడం లో మెటా పూర్తి విఫలం అయిందని మండి పడింది. అందుకు కారణం గా మెటా కు మాస్కో కోర్టు 13 మిలియన్ రూబెల్స్ అనగా రూ. 1 కోటి 33 లక్షలను జరిమానాగా విధించింది.
కాగ రష్యా లో ఫేస్ బుక్ పేరెంట్ సంస్థ అయిన మెటా కు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. కాగ రష్యా విధించిన జరిమానా పై మెటా ఇంకా స్పందించలేదు. కాగ ఇంటర్నెట్ ట్రోలర్స్ ను నియంత్రించడానికి రష్యా ప్రభుత్వం కఠినమైన నిబంధనలను తీసుకు వస్తుంది. కాగ ట్రోలర్స్ వల్ల తమ దేశంలో చట్ట విరుద్దమైన కంటెంట్ లు సోషల్ మీడియా లో ఎక్కువ అయితున్నాయని రష్యా ప్రభుత్వం వాధిస్తుంది. అయితే మాస్కో కోర్టు విధించిన జరిమానా పై మెటా ప్రతినిధులు ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠ గా మారింది.