సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’ను మేకర్స్ పక్కా కమర్షియల్ గానే ప్రమోట్ చేస్తున్నారు. వచ్చే నెల 1న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఓ అప్ డేట్ ను వినూత్నంగా ఇచ్చారు.
ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసినట్లు విడుదల చేశారు. కానీ, అందులో వీడియో బఫర్ అవుతున్న క్రమంలో..ఈ నెల 12న ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఇందులో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘పక్కా కమర్షియలే’ అని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.
గోపీచంద్, రాశీ ఖన్నా కలిసి నటించిన ఈ చిత్రం డెఫినెట్ గా బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో హీరో, హీరోయిన్ ఇద్దరూ లాయర్స్ గా కనిపించనున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు స్టోరిని తన దైన శైలిలో మారుతి డీల్ చేసినట్లు మేకర్స్ చెప్తున్నారు.