వైఎస్ఆర్ పాలన మళ్లీ తీసుకొస్తా: వైయస్ షర్మిల

-

ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం,నారపనేనిపల్లి,గౌండ్ల పాలెం గ్రామంలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నిర్వహించారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. “మాట తప్పని, మడమ తిప్పని వైఎస్ఆర్ బిడ్డగా హామీ ఇస్తున్నా.. వైఎస్ఆర్ పాలన మళ్లీ తీసుకొస్తా. ప్రతి వర్గాన్ని ఆదరించి ఈ రాజన్న బిడ్డ సాధ్యం చేసి చూపిస్తుంది. పెద్దాయన పేరు నిలబెడతా…

రైతు సంక్షేమం కోసం, మహిళల అభివృద్ధి కోసం పని చేస్తా. పేద బిడ్డలను ఉచితంగా చదివిస్తా.. ఉచితంగా కార్పోరేట్ వైద్యం అందిస్తా… ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు పెద్దపీట వేస్తా.” అని హామీలు ఇచ్చారు. వైయస్సార్ ఐదు ఏళ్ళు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారని.. కానీ ఆయన పథకాలు ప్రతి గుండెను, ప్రతి గడపను తకాయని షర్మిల చెప్పుకొచ్చారు. నీ అభిమానం చూస్తుంటే వైయస్సార్ ఇంకా బ్రతికే ఉన్నారు అనిపిస్తోంది అన్నారు.

తెలంగాణ లో పేద ప్రజలకు సంక్షేమ పాలన అందడం లేదన్నారు. సంక్షేమ పాలన కోసమే వైయస్సార్ తెలంగాణ పార్టీ పెట్టామని తెలిపారు. కెసిఆర్ ను రెండుసార్లు గెలిపించినా ప్రజల పక్షాన కాకుండా ఆయన స్వార్థం కోసం పని చేస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version