చైనా ను కించపరిచేలా పాంపియో వ్యాఖ్యలు,ఖండించిన డ్రాగన్ దేశం

-

ఇటీవల కరోనా వైరస్ సోకి చైనా లో వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ ను అరికట్టడం కోసం చైనా విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో లభించలేదు. అయితే కరోనా వైరస్ ను అరికట్టడంలో చైనా చేస్తున్న కృషిని కించపరిచేలా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ చైనా విదేశాంగ మంత్రి హువా చునియాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తమను కించపరుస్తుంది చైనా తీవ్ర స్థాయిలో మండిపడింది. దీనిపై చైనాలోని అమెరికన్‌ రాయబారిని పిలిపించుకుని ఈ మేరకు తన అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. వైట్‌ హౌస్‌లో జతీయ భద్రతా మండలి ప్రతినిధి చైనీస్‌ జర్నలిస్టులను బెదిరించడంపైనా హువా ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ ఈ విషయంలో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తీవ్ర తప్పిదానికి పాల్పడిందని, దీనికి ఆ పత్రిక బాధ్యత వహించాల్సి ఉంటుందని చైనా హెచ్చరించింది. అలానే మైక్‌ పాంపియో ఆ పత్రికను వెనకేసుకురావడానికి ప్రయత్నించడం సిగ్గు చేటు అంటూ చైనా వ్యాఖ్యానించింది.

చైనా వార్తా సంస్థలపై ఆంక్షలు విధించడం, లేదా వేధించడం వంటి చర్యలకు అమెరికా స్వస్తి చెప్పాలని, లేకుంటే తగు రీతిలో జవాబిస్తామంటూ హువా హెచ్చరించినట్లు తెలుస్తుంది. గత కొంత కాలంగా భారీ స్థాయిలో ప్రబలిన ఈ కరోనా వైరస్ కారణంగా చైనా లో 2800 మందికి పైగా మృత్యువాత పడ్డారు.అలానే వేలాది మంది ఈ వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోపక్క ఈ వైరస్ కారణంగా ప్రపంచదేశాలు కూడా వణికిపోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version