పాన్ ఆధార్ ని లింక్ చెయ్యలేదా..? గడువు మరో 6 నెలలు పెంపు..?

-

పాన్ కార్డు అందరికీ తప్పక అవసరం. పాన్ కార్డు కలిగిన వారు కచ్చితంగా ఆధార్ తో లింక్ చేసుకోవాలి. ఎప్పటి నుండో ఈ విషయం గురించి చెబుతూనే వున్నారు. దీనికి గడువు మార్చి 31గా వుంది ఇప్పటికే ఈ గడువు ని చాలా సార్లు ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు. పాన్ ఆధార్ లింక్ డెడ్‌లైన్ పొడిగిస్తూ వచ్చింది ప్రభుత్వం. ఈసారి మాములుగా అయితే ఈ నెల లో ఈ గడువు ముగియనుంది కానీ మరో సారి ఈ విషయం పైన కీలక నిర్ణయం తీసుకునేలా కనపడుతున్నారు.

మార్చి 31లోపు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోతే ఇబ్బంది పడాలి. ఒకవేళ లింక్ చేసుకోపోతే బ్యాంక్ అకౌంట్ నుంచి ట్యాక్ రిటర్న్స్ దాకా సమస్యలు ఎదురవుతాయి. అందుకే వెంటనే లింక్ చేసుకోవడం మంచిది. ఒకవేళ లింక్ అవ్వక పోయినట్లయితే పాన్ కార్డు లో లేదంటే ఆధార్ కార్డులో వివరాలు మార్చుకోవాల్సి వస్తుంది. మిస్ మ్యాచ్ కారణంగా రెండింటినీ లింక్ చేసుకోలేని వాళ్ళు కూడా వున్నారు.

ఇంకా రెండిటినీ లింక్ చేసుకోకపోయుంటే చాలా మంది గడువు పొడిగిస్తే బాగుంటుందని భావిస్తూ ఉండొచ్చు. కాంగ్రెస్ నేత పార్లమెంట్ సభ్యుడు అధిర్ రాజన్ చౌదరీ ప్రధాని మోదీకి ఈ విషయం పై లేఖ రాసారు. పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ గడువు మరో ఆరు నెలలు ఎక్స్టెండ్ చెయ్యాలని కోరారు. ప్రస్తుతం పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్‌కు రూ 1000 చెల్లించాలసి వుంది. ఈ లేఖకు మోదీ సానుకూలముగా స్పందిస్తే గడువుని పొడిగించచ్చు. మరి ఏం అవుతుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version