తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలంతా తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగను జరుపుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు కూడా తమ కుటుంబంతో పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదే విధంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు చెబుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది అని కేటీఆర్ పేర్కొన్నారు. గతించిన కాలాన్ని మరిచిపోయి, కొత్త ఏడాది కి ఘన స్వాగతం పలుకుదాం అన్నారు. ఈ ఏడాది పొడవునా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్.
కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. గతించిన కాలాన్ని మరిచిపోయి, కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలుకుతూ,ఈ ఏడాది పొడవనా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🙏#HappyUgadi2023
— KTR (@KTRBRS) March 22, 2023
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా.. ప్రజలంతా ప్రగతిపథంలో ముందుకు సాగాలని కవిత ఆకాంక్షించారు. ప్రతి ఇంటా ఆరోగ్యం – ఆనందంతోపాటు సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్పారు.
తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా.. ప్రజలంతా ప్రగతిపథంలో ముందుకు సాగాలని, ప్రతి ఇంటా ఆరోగ్యం-ఆనందంతోపాటు సిరిసంపదలు వెల్లివిరియాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు #Ugadi
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 22, 2023